సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:00 IST)

ఖానాపూర్‌లో నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు...

murder
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. నిర్మల్ జిల్లాలో నడి రోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఓ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణం జిల్లాలని ఖానాపూర్ పరిధి శివాజీ నగర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు. ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్‌ స్వీటీ (20).. టైలరింగ్‌ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్‌, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.