గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (15:24 IST)

రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారు.. హరీష్ రావు ప్రశ్న

harish rao
అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. 
 
ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
యాసంగి పంట వేసే సమయం వచ్చిందని.. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. డిసెంబర్ 9 వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని హరీష్‌‌రావు నిలదీశారు.
 
తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని హరీష్ రావు కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9న ఇస్తామని చెప్పారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని రైతుల పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.
 
కొత్తగా పదవీ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత కావాలని.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు.