శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (10:08 IST)

బిర్యానీ డబ్బులు అడిగారనీ హోటల్‌ సిబ్బంది తలపగులగొట్టారు (Video)

attack on hotel
హైదరాబాద్ నగరంలోని లాలగూడలోని ఓ హోటల్‌లో దారుణం జరిగింది. లాలగూడలోని సూపర్ స్టార్ హోటల్‌లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో హైటర్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అక్కడి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఓ దుండగుడు జరిపిన ఈ దాడిలో హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. తలపగిలిపోయింది. ఈ కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రతి రోజూ తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న దుండగుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది రౌడీషీటర్ సలీంగా గుర్తించారు.