గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

చెరువు వద్ద అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్... కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితులు (Video)

demolition
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి చెరువును ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించుకున్న గృహాలపై హైడ్రా బుల్డోజర్ ప్రయోగిస్తుంది. చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్‌‍ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఆదివారం ఉదయం నుంచి ఈ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించింది. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 
కూకట్‌పల్లి నల్ల చెరువు వద్ద ఉన్న నిర్మాణాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎటువంటి నోటీసు లేకుండా కూల్చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల రూపాయలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్న ఓ బాధితుడు బోరున విలపిన్నాడు. అయితే, కొందరు బాధితులు మాత్రం కూల్చివేతలకు కొంత సమయం ఇవ్వాలంటూ కోరుతున్నారు.