గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:47 IST)

కూకట్‌పల్లిలో కూల్చివేతలు ప్రారంభం.. భారీగా పోలీసుల మొహరింపు

HYDRAA
హైదరాబాద్ నగరంలో నీటి వనరులను ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఈ కూల్చివేతలు సాగుతూవచ్చాయి. అయితే, ఆదివారం కూకట్‌పల్లిలో మొదలుపెట్టారు. 27 ఎకరాల్లో విస్తరించిన కూకట్‌పల్లి చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది. దీంతో ఇక్కడ కూల్చివేతలను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీగా పోలీసులను మొహరించారు. 
 
చెరువులోని ఎఫ్.టి.ఎల్, బఫర్‌జోన్‌లో ఏడు ఎకరాల ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌జోన్‌లోని నాలుగు ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లను నిర్మించారు. అలాగే ఎఫ్.టి.ఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టుగా నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు. నివాసం ఉంటున్న గృహాలను నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వాటిని కూల్చివేయనున్నారు.