ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (10:34 IST)

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమించిన తెలంగాణ సర్కారు

telangana state
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించింది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సమర్పించాని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీల వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా ఈ ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనుంది. 
 
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పర్యాయాలు సమావేశమైన ఈ కమిటీ ఎస్సీ రిజర్వుడ్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం షమీమ్ అక్తర్‌ను నియమించింది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో శనివారం పర్యటించనున్నారు. నాగర కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి ఆయన రానున్నారు. దసరా పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం ప్రత్యేక హెలికాఫ్టరులో ఆయన హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. ఆయన రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దసర పండుగ నాడు కొండారెడ్డిపల్లికి వస్తుంటారు. గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.