సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (17:08 IST)

95,235 ఓట్ల మెజారిటీ వల్లే పల్లా శ్రీనివాసరావుకు ఏపీ టీడీపీ పగ్గాలు

tdpflag
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పల్లా విజయం పార్టీలో ప్రతిష్టాత్మక స్థానానికి ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించింది. గతంలో అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
 
ప్రస్తుతం అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులైన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త నేతను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును ఎంపిక చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. 
 
అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ అధ్యక్షునిగా వేరే వారిని నియమించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావును నియమించడంతో టీడీపీ కేడర్ అభినందనలు చెబుతున్నారు.