శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (17:22 IST)

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఏపీ తెదేపా అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే నియామకం

Palla Srinivasa Rao-Babu
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 95 వేల పైచిలుకు అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి విజయం సాధించిన తెదేపా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆంధ్ర ప్రదేశ్ తెదేపా అధ్యక్ష పగ్గాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇప్పటివరకూ అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడికి మంత్రిమండలిలో చోటు లభించడంతో ఆయన తెదేపా అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీనితో ఆ స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.