ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (19:33 IST)

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

Kumari Aunty
Kumari Aunty
తెలంగాణ వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందించారు. కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు. రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ మరో సంచలనం సృష్టించారు.

తన వంటకాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి కలిసే తన కల తీర్చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ పోలీసులు తొలగించడం వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుమారి ఆంటీ సోషల్‌ మీడియాలో రాజకీయంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.