Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ లాయర్ దారుణంగా హత్యకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఇజ్రాయెల్ ఇంట పనిచేసే మహిళను దస్తగిరి వేధింపులకు గురిచేయడంతో.. బాధితురాలి తరపున ఇజ్రాయేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు.
ఈ ఫిర్యాదు కారణంగా ఇజ్రాయెల్‌పై కక్ష్య పెంచుకుని అడ్వకేట్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలించారు. ఇంతలో హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు.