సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (15:12 IST)

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్

sriganesh - revanth
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే నెల 13వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా నారాయణన్ శ్రీగణేష్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారుచేసింది. ఈయన ఇటీవలే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గణేష్ పేరును ఖరారు చేసినట్టు ప్రకటించారు. 
 
కాగా, శ్రీగణేష్... ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన లాస్య నందిత గెలుపొందారు. అయితే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. కాగా, తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.