బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (20:39 IST)

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

kcrcm
వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 11నెలల పూర్తయిందని.. ఇప్పుడు ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలుసొచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేటీఆర్ భేటీ అయ్యారు. మాకు మాటలు రావనుకుంటున్నారా..? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాం అని కేసీఆర్ అన్నారు. రౌడీ పంచాయతీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు.
 
కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ చెప్పారు. ప్రజలను నేరుగా కలవడంతోపాటు పార్టీ శ్రేణుల్లో కేసీఆర్ ఉత్సాహం నింపనున్నారు.