బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:06 IST)

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనంటున్న రాజా సింగ్, ఎందుకని?

rajasingh
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాజాసింగ్ డిశెంబరు 9న మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించినవారందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయబోతుంటే తను చేయనని భీష్మించారు. దీనితో ఒక్కసారిగా రాజాసింగ్ వార్తల్లో నిలిచారు. దీనికి కారణం ఏంటయా అంటే... ప్రొటెం స్పీకరుగా ఎంఐఎం అక్బురుద్దీన్ ఓవైసీ వుండటమేనట. ఆయన ప్రొటెం స్పీకరుగా వుంటే తను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని తేల్చి చెప్పారు. రజాకార్ల వారసులైన ఎంఐఎం నాయకుడు సమక్షంలో తను ప్రమాణం చేయబోనని చెపుతున్నారట.
 
మరోవైపు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాజాసింగ్ తను చేయనని చెప్పడంతో భాజపా స్టాండ్ ఏంటన్నది తెలియాల్సి వుంది. గతంలో కూడా తను ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకరుగా వ్యవహరించగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదనీ, ఆ తర్వాత కొద్దిరోజులకు చేసినట్లు చెప్పారు రాజాసింగ్.