ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (15:42 IST)

మియాపూర్‌ లాడ్జిలో శవమై కనిపించిన టీచర్.. ఏం జరిగింది?

హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ లాడ్జిలో పాఠశాల ఉపాధ్యాయుడు శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జై ప్రకాష్ తుల్లే (30) రెండు రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి కూకట్‌పల్లిలో తన సోదరిని కలిసేందుకు వచ్చాడు. 
 
శనివారం మధ్యాహ్నం తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి మియాపూర్‌లోని లాడ్జిలోకి వచ్చాడు. ఆదివారం శవమై కనిపించాడు. అతడు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడి వుంటాడని తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.