ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

కర్నాటకలో హైదరాబాద్ రియల్టర్ దారుణ హత్య!!

murder
కర్నాటక రాష్ట్రంలో హైదరాబాద్ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) అనే వ్యక్తి బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా చేస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24వ తేదీన కుటుంబ సభ్యులకు బీదర్ బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్ధారెడ్డిని వెంట తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో మధుకు భార్య వెంకటలక్ష్మి ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్టు చెప్పాడు. గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అయింది. తెల్లవారినా మధు ఇంటికి చేరలేదు. 
 
మరోవైపు, తర్వాతి రోజున బీదర్ జిల్లాలోని 25వ తేదీన మన్నేకెళ్ళి పోలీస్ స్టేషన్‌ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు, పక్కనే మృతదేహం లభ్యమైంది. కారు నంబర్ ఆధారంగా చనిపోయింది మధు అని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 
మధును దుండగులు కత్తులతో పొడిచి బండరాయితే తలపై మోది హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధు ఒంటిపై రూ.6లక్షలు విలువైన బంగారు నగలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వాటి కోసమే నిందితులు ఆయనను హత్య చేసినట్టు భావిస్తున్నారు. మధుతో పాటు బీదర్ వెళ్లిన రేణుక ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్ధార్థ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.