గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 డిశెంబరు 2023 (15:22 IST)

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రూ. 75 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Konda Surekha-Revanth Reddy
సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లును తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పలు సూచనలు చేసారు. మరోవైపు 2024 ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు గిరిజన జాతర జరుగుతుంది. 
 
సంప్రదాయం ప్రకారం తొలిరోజు సారక్క విగ్రహాన్ని కన్నెపల్లి నుంచి మేడారం వరకు, పగిడిద్ద రాజు విగ్రహాన్ని పూనుగొండ్ల నుంచి మేడారం వరకు తీసుకువెళ్లనున్నారు. రెండవ రోజు కొండాయి గ్రామం నుండి గోవిందరాజు విగ్రహంతో పాటు సమ్మక్క దేవి విగ్రహం, కుంకుమ పేటికను మేడారంకు తీసుకువస్తారు. 
 
మూడవ రోజు భక్తులు వనదేవతలకు పూజలు చేసి, చివరి రోజు "తల్లుల వనప్రవేశం"తో జాతర ముగుస్తుంది. కుంకుమ పేటిక (సమ్మక్క) చిలకలగుట్టకు తిరిగి తీసుకుని వస్తారు. తదుపరి పండుగ వరకు అక్కడే ఉంచబడుతుంది. ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు మేడారం వద్ద ప్రార్థనలు చేస్తారు.