బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (08:27 IST)

ఎముకలోని మూలుగు కోసం రద్దయిన పెళ్లి....ఎక్కడ?

bone marrow
హాస్య నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బలగం". ఈ చిత్రంలో ఎముక మూలుగు కోసం బావ బామ్మర్ధులు గొడవపడతారు. అచ్చం అలాగే, బొక్క మూలుగు (గుజ్జు) కోసం గొడవ జరిగింది. దీంతో ఏకంగా పెళ్ళిని రద్దు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో వెలుగు చూసింది. 
 
ఈ మండలానికి చెందిన ఓ యువతీయువకుడికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కట్నకానుకలు సైతం మాట్లాడుకున్నారు. నబంవరు మొదటి వారంలో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా యువతి ఇంట్లో మాంసాహారంతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
 
ఈ విందుకు వచ్చిన వరుడు తరపు బంధువులు మూలుగు బక్క కావాలని అడగడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఇరు వర్గాలు శాంతించినప్పటికీ ఈ పెళ్లి సంబంధం మాత్రం రద్దు అయింది. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.