బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

విభజన హామీ మేరకు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి

komatireddy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటీవల కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దానికోసం తనవంతు కృషిచేస్తానని తెలిపారు. 
 
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు. విభజన వేళ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా" అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు.