ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (12:33 IST)

ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలో బోనాలు

bonalu
ఆషాఢమాసం మొదటి ఆదివారం (నేటి నుంచి) ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయానికి మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు నేతలు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
గోల్కొండలో జరిగే బోనాల పండుగకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరవుతారని బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ఆషాడ బోనాలు వేడుకలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.