శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (09:14 IST)

విద్యార్థునిలతో ఇటుకలు మోయించిన ఎస్ఓ (Video)

bhavani so
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) భవానీ విద్యార్థినిలతో ఇటుకలు మోయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండటంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోయించారు. 
 
యాదాద్రి భువనగిరి - చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పండుగ రోజు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోపిస్తూ కూలీ పని చేయించారు. విద్యార్థినిలతో ఇటుకలు మోపించడం ఏంటి అని ప్రశ్నించిన వారికి పని చేయించడం తప్పా అని అంటూ ఆమె పొగరుగా సమాధానమిచ్చారు.