మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (11:18 IST)

తెలంగాణ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ దాసరి

Sahiti
Sahiti
తెలుగు యువ నటి సాహితీ దాసరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. పొలిమేర 2లో ఈమె కనిపించింది. సినీ పరిశ్రమలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతారని అందరూ భావించిన తరుణంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.   
 
సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌కు చెందిన కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రెడ్డితో పోటీ పడనున్నారు. 
 
ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలని, అది కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఆమె నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.