ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (18:59 IST)

పొలిమేర 2 ఓటీటీ.. ఆహాలో స్ట్రీమింగ్

maa oori premakatha
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో చేతబడుల కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా 2021లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా వచ్చినా అదిరిపోయే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ని థ్రిల్ చేసి ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ సంపాదించుకుంది. 
 
ఇక ఈ మూవీ ఎండ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ పెట్టి సీక్వెల్‌కి హింట్ ఇచ్చారు. ప్రస్తుతం పొలిమేర 2 ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. 
 
కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. శుక్రవారం ఆహాలో అందరికి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.