వచ్చే 5 రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండుతాయి జాగ్రత్త
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు తెలియజేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుందనీ, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి పెరుగుతాయని తెలిపింది.
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వున్నందున సాధ్యమైనంత వరకూ ఉదయం లేదా సాయంత్రం పనులు చక్కబెట్టకోవాలని తెలియజేసింది. ఎండవేడిమి ఎక్కువైనప్పుడు బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రానికి కిందిస్థాయి గాలులు బలంగా వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.