1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (16:47 IST)

తెలంగాణాలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ - ఇంజనీరింగ్ షెడ్యూల్ కూడా..

students telangana
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. దీన్ని రెండు విడతల్లో నిర్వహించనున్నారు. జూన్ 20వ తేదీన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జూన్ 22వ తేదీన తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30వ తేదీన మొదట విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. జూన్ 7వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ మొదలుపెడతారు. జూలై 9వ తేదీన రెండు విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 13వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జూలై 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 21వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చారు. జూలై 24వ తేదీన సీట్లను కేటాయించి, జూలై 23వ తేదీన స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు. 
 
అలాగే, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేశారు. జూన్ 27వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జూన్ 30వవ తేదీ నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జూలై 12వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జూలై 19వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్, జూలై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 30వ తేదీన ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్టు 5వ తేదీన తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.