శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (17:58 IST)

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్

TSRTC
TSRTC
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై బైకర్‌ దాడి చేసిన ఘటనపై సజ్జనార్‌ స్పందించారు. 
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా వారంతా ఎంతో ఓర్పుతో, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
 
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంతో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.