సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (10:43 IST)

పట్టాలు తప్పిన ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్.. మూడు భోగీలు...?

train
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ మీదకి వస్తుండగా రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 
 
ఈ ఘటనలో పది మంది ప్రయాణీకులకు గాయాలైనాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంకు సంబంధించి ఇంకా వివరాలు వెలువడలేదు. 
 
ఇంజన్‌తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నాంపల్లి నుంచి రైళ్ల రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని వారు చెప్పారు.