ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (17:17 IST)

గంజాయి మత్తులో యువకులు.. బట్టలిప్పి యువకుడిపై దాడి చేశారు.. ఎక్కడ? (video)

Suryapet District
Suryapet District
గంజాయి మత్తులో యువకులు దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడ్ని నలుగురు యువకులు చితకబాదారు. నడి రోడ్డుపై భాదితుడి బట్టలిప్పి పోకిరీలు చావబాదారు. స్థానిక అంజలి స్కూల్ సమీపంలో యువకుడిపై గంజాయి బ్యాచ్ ఈ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా స్థానిక అంజలి స్కూల్ సమీపంలో రాత్రి వేళ నడి రోడ్డుపై యువకుడి బట్టలువిప్పి చితక్కొట్టారు. దాడికి పాల్పడిన యువకులు గంజా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. వారించేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా దాడికి ప్రయత్నించడంతో.. స్థానికులు సైతం చూస్తూ ఉండిపోయారు. 
 
పాత ఘర్షణల నేపథ్యంలో యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ యువకులపై పాత గంజాయి కేసులున్నట్లు తెలుస్తోంది.