1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (13:52 IST)

టోల్ అడిగారని టోల్ గేట్‌నే లేపేశాడు : ఎక్కడ? (Video)

jcb driver
టోల్ ఫీజు చెల్లించాలని అడిగినందుకు ఓ వ్యక్తి ఏకంగా టోల్ గేట్‌నే లేపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపుర్ వద్ద ఢిల్లీ - లక్నో జాతీయ రహదారిపై జరిగింది. ఈ టోల్ గేట్ మీదుగా వెళుతున్న ఓ జేసీబీ డ్రైవర్‌ను టోల్ ఫీజు చెల్లించాలంటూ టోల్ సిబ్బంది అడిగారు. ఇది జేసీబీ డ్రైవర్‌కు ఆగ్రహం తెప్పించింది. అంతే... తాను నడుపుతూ వచ్చిన జేసీబీతోనే ఓ టోల్ ప్లాజాను పూర్తిగా ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం రద్దుకు కసరత్తు : సీఎంగా చంద్రబాబు సంతకం 
ఏపీలో గత వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూయాజమాన్య హక్కు చట్టు (ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2002)ను రద్దుకానుంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమణ స్వీకారం చేసిన తర్వాత ఈ చట్టం రద్దు ఫైలుపై ఆయన తన రెండో సంతకం చేయనున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆయన సంతకం చేశారు. 
 
టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తరపున చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రెవెన్యూశాఖ నుంచి ప్రభుత్వానికి అందాయి. దీనిని న్యాయశాఖ వద్దకు పంపబోతున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల అనంతరం చంద్రబాబు ఈ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత.. చట్టం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో టైటిలింగ్ చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెడతారు.
 
కాగా, గత ప్రభుత్వం రూపొందించిన టైటిలింగ్ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్ధకం చేశాయి. సొంత స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజమాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్ కోర్టులను వైకాపా ప్రభుత్వం తప్పించడం దుమారాన్ని రేపింది. వైకాపా ప్రభుత్వం 2023 అక్టోబరు 31వ తేదీ నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీవో జారీచేయడం భూ యజమానులకు ఆందోళన కలిగించింది. 
 
అలాగే.. చట్టంలోని సెక్షన్-28కి అనుగుణంగా ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ దానికి చైర్ పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబర్ 29న ప్రభుత్వం జీవో జారీచేసింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన టైటిలింగ్ చట్టానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడిచి.. తన ఇష్టమొచ్చినట్లు నియమ నిబంధనలు రూపొందించి, అందరిని కలవరానికి గురిచేసింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన 'నమూనా టైటిలింగ్ చట్టం' సెక్షన్-5లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(టీఆర్) నియామకం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 
 
నోటిఫికేషన్ జారీచేయడం ద్వారా ఏ అధికారినైనా (ఎనీ ఆఫీసర్) టీఆర్వోగా నియమించవచ్చని తెలిపింది. అయితే.. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం సెక్షన్ 5లో 'ఏ వ్యక్తినైనా(ఎనీ పర్సన్) టీఆర్డీఓగా నియమించవచ్చని పేర్కొంది. రికార్డుల్లో యజమానుల పేర్లను ఓ సారి చేర్చి నోటిపై చేసిన తర్వాత మూడేళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని నమూనా చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. 
 
రాష్ట్ర చట్టంలో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు. రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును రెండేళ్లకే పరిమితం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే నీతి ఆయోగ్ నమూనా చట్టం సెక్షన్ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టులో అప్పీలు అవకాశం ఇవ్వలేదు. హైకోర్టులో రివిజన్‌కు మాత్రమే దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయనున్నారు.