శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (14:11 IST)

ఒక యువతి చుట్టూ 16 మంది యువకులు, డబ్బు కోసం ఆ పని చేస్తున్నానంటూ...

ఒకే ఒక్క యువతి. ఒంటిపై బట్టలు లేవు. నగ్నంగా డ్యాన్సు చేస్తోంది. చుట్టూ 16 మంది యువకులు ఉన్నారు. వారు పేకాట ఆడుతూ యువతి డ్యాన్సును చూస్తున్నారు. విషయం కాస్త పోలీసులకు తెలిసింది. చడీచప్పుడు కాకుండా అక్కడకు వచ్చి ఆ దృశ్యాలను నేరుగా చూసిన పోలీసులు షాకయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
 
ఒక అజ్ఞాతవాసి ఇచ్చిన సమాచారంతో నిన్న రాత్రి తెలంగాణా రాష్ట్రం సూర్యాపేటలోని నగర శివార్లలో పోలీసులు రైడ్ చేశారు. ఒక యువతి పూటుగా మద్యం సేవించి ఉంది. ఒంటిపై బట్టలు కూడా లేవు. నగ్నంగా పాటలకు డ్యాన్సులు వేస్తోంది. ఒకే పెద్ద గదిలో 16 మంది యువకులు కూర్చుని పేకాట ఆడుతున్నారు. దీంతో షాకయ్యారు పోలీసులు.
 
ఆ యువతిని విచారిస్తే తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇంట్లో గొడవపడి బయటకు వచ్చి ఇలా చేస్తున్నట్లు ఒప్పుకుంది. ఇక పేకాట ఆడుతున్న ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఒక్క యువతే కాకుండా మరో ముగ్గురు యువతులు కూడా ఇదే విధంగా వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.