ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (09:49 IST)

తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 1050 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ కరోనా మహమ్మారి వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1050 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,736 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృత్యువాతపడ్డారు. ఇవాళ్టివరకు రాష్ట్రంలో 2,56,713 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,38,908 మంది చికిత్సకు కోలుకున్నారు.
 
మరో 16,404 మంది దవాఖానల్లో, హోంఐసోలేషన్‌లో 13,867 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు 1,401 మృతి చెందారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 232 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
కోవిడ్‌ మరణాల రేటు భారత్‌ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.54 శాతానికి పడిపోయింది. ఇక, రికవరీ రేటు దేశంలో 93 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 93.06% శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 16,404 యాక్టివ్ కేసులు ఉండగా.. 13,867 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. మరోవైపు.. మంగళ వారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 41002 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి దాకా 48,53,169 టెస్ట్ లు చేశారు.