సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:44 IST)

9 మరణాలు - 2579 కేసులు : ఇదీ తెలంగాణలో కరోనా లెక్క

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడేలా కనిపించడం లేదు. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2579 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదేసమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1752 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. ఆసుపత్రుల్లో 23,737 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 84,163 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 770కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 మందికి కొత్తగా కరోనా సోకింది. 
 
సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో 8,601 పాజిటివ్ కేసులు రాగా, 86 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరగా, కరోనా మృతుల సంఖ్య 3,368కి పెరిగింది. 
 
తాజాగా 8,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఈ మహమ్మారి వైరస్ నుంచి విముక్తులైన వారి సంఖ్య 2,68,828గా నమోదైంది. ప్రస్తుతం 89,516 మంది చికిత్స పొందుతున్నారు.