ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Vasu
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:17 IST)

కింగ్ ఫిషర్ బీర్ దొరకడంలేదంటూ రోడ్డెక్కిన మందుబాబు... హంగామా...

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడనేది ఒకప్పటి సామెత. కానీ మందుబాబుల తీరు కూడా అదేవిధంగా ఉంటూందనేది తాజాగా నిరూపితమవుతోంది. వివరాలలోకి వెళ్తే.... బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాను భారత్‌

ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడనేది ఒకప్పటి సామెత. కానీ మందుబాబుల తీరు కూడా అదేవిధంగా ఉంటూందనేది తాజాగా నిరూపితమవుతోంది. వివరాలలోకి వెళ్తే.... బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి అధికారులు ఓ వైపు నానా తిప్పలు పడుతూంటే.. తెలంగాణకు చెందిన ఒక కింగ్ ఫిషర్ లవర్ మందు బాబు సదరు బ్రాండ్ బీర్‌ల అమ్మకాల కోసం ఏకంగా ప్రభుత్వానికే మొర పెట్టుకోవడం సంచలనంగా మారింది.
 
మందుబాబులు బియ్యం, ఉప్పు, పప్పుల విషయంలో రాజీ పడతారేమో కానీ మద్యం బ్రాండ్‌ల విషయంలో ఏమాత్రం రాజీపడరనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన ‘కింగ్ ఫిషర్’ బీర్ బాటిళ్ల కోసం ఏకంగా కలెక్టరేట్ తలుపు తట్టడం తెలంగాణాలో చర్చనీయాశంగా మారింది. 
 
‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నార'ని వాపోయిన సదరు అయిల సూర్యనారాయణ జగిత్యాలతో పాటు మరికొన్ని మండలాల్లో కింగ్ ఫిషర్ బీర్ విక్రయించడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయదారులందరూ సిండికేటుగా మారి స్థానిక వైన్‌షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొన్ని సంవత్సరాలుగా కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. పొరుగున కరీంనగర్‌లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. తమకెంతో ఇష్టమైన బీర్ అమ్మకాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు ప్రజావాణిలో ఓ లేఖ రాశారు. 
 
జగిత్యాల పట్టణంతో సహా పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపివేశారనే అంశంపై విచారణ జరిపించాలనీ, మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు, కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపించి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలనీ ఆయన సదరు లేఖలో విన్నవించుకున్నారు.
 
కాగా, కింగ్ ఫిషర్ బీర్‌లో దుమ్ము కణాలు వచ్చినట్లు గతంలో ఫిర్యాదు అందిందనీ, దానితోపాటు మిగతా బీర్లతో పోలిస్తే కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లు తేలిగ్గా పగిలిపోతాయని, మిగిలిపోయిన స్టాక్‌ను వాపసు తీసుకోవడంలోనూ కింగ్ ఫిషర్ సంస్థ తాత్సారం చేస్తోందని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే రెండేళ్లుగా జగిత్యాలలో మద్యం వ్యాపారులు ఈ బ్రాండ్ బీర్ల అమ్మకాలు నిలిపేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ వెల్లడించడం గమనార్హం. మొత్తం మీద జగిత్యాలలో మందుబాబుల తడాఖా అదిరిపోతోందనే చెప్పవచ్చు.