ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (14:40 IST)

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

telangana
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ అనుబంధ విద్యాసంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం తెలంగాణాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఏపీవీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంటర్ విద్యా విధానంలో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ఏబీవీపీ ఆందోళన చేపడుతుందని తెలిపారు. 
 
ఇందులోభాగంగా, సోమవారం నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాలు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరిని ఖండిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఆయన వెల్లడించారు.