మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (22:45 IST)

హైదరాబాదులో స్కూల్ టీచర్ పైన యాసిడ్ దాడి..

హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో యాసిడ్ దాడి జరిగింది.. సంస్కార్ ప్రైవేటు స్కూల్‌‌లో టీచర్‌‌గా పనిచేస్తున్న సూర్యకుమారి(30)పై బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ పోశాడు. దీంతో సూర్యకుమారి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను కు

హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో యాసిడ్ దాడి జరిగింది.. సంస్కార్ ప్రైవేటు స్కూల్‌‌లో టీచర్‌‌గా పనిచేస్తున్న సూర్యకుమారి(30)పై బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ పోశాడు. దీంతో సూర్యకుమారి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను కుకట్‌పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. అయితే దుండగుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని దాడి చేయడంతో పోలీసులు కేసును ప్రత్యేకంగా చూస్తున్నారు. ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడికి కారణాలు తెలియాల్సి వుంది.