శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (18:53 IST)

ప్రధాని పదవిపై కేసీఆర్ కన్ను.. రాజ్యసభ స్థానానికి ప్రకాష్ రాజ్? (Video)

సినీనటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణ రాజ్యసభ స్థానానికి ప్రకాష్ రాజ్ ఎంపిక కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తెలంగాణ సీఎం పగ్గాలు కుమారుడైన, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అప్పగించి.. ప్రధాని పీఠంపై సీఎం కేసీఆర్ కన్నేశారని ఇప్పటికే ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. 
 
ఇందులో భాగంగా జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు కొత్త బృందాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతలను చేతబెట్టుకుని ముందుకెళ్లాలని గులాబీ చీఫ్ అనుకుంటున్నారు. 
 
ఇకపోతే.. ఆదివారం చేపట్టిన  ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే బిజెపి వ్యతిరేకతతో పాటు జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడంతో పాటు ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై పట్టు ఉన్న దృష్ట్యా ప్రకాష్‌ రాజ్‌ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయి  బృందంతో  పాటు రాజ్యసభ స్థానానికి కూడా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.