శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మే 2023 (22:05 IST)

ఈ వేసవిలో హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో సాహసోపేత డ్రాగన్‌ఫ్లై కిడ్స్ ఫెస్టివల్

Summer
వేసవి ఎండలు మండుతున్నాయి. సెలవుల కాలం పూర్తి స్వింగ్‌లో ఉంది! వేసవి రాకను తెలియజేసే తూనీగలు, మాల్‌లో తమ ఉనికిని చాటుకుంటున్నందున పిల్లలు ఇప్పుడు ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌లో తమ వేసవి సెలవులకు మరింత ఆహ్లాదాన్ని జోడించుకోవచ్చు. 12 ఏళ్లలోపు పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి మే 20 నుండి జూన్ 4, 2023 మధ్య అక్కడికి చేరుకుని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్రాగన్‌ఫ్లై కిడ్స్ ఫెస్టివల్‌లో పాల్గొనవచ్చు.
 
రెండు వారాల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో పిల్లలు పాల్గొనడానికి ఉత్తేజకరమైన గేమ్‌లు, 10కి పైగా వర్క్‌షాప్‌లు ఉన్నాయి. అంతేకాదు, వారు స్పైడర్-వెర్స్ లోని స్పైడర్‌మ్యాన్ టూన్ క్యారెక్టర్‌ను కలుస్తారు, గారడీ చేసేవారు, తోలుబొమ్మలు, ఇంద్రజాలికుల అద్భుతమైన ప్రదర్శనలను ఆస్వాదిస్తారు. మాల్, తమ సందర్శకులకు ఉన్నతమైన అనుభవాలను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందింది, డ్రాగన్-ప్రేరేపిత డెకర్ ద్వారా పిల్లలను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.
 
ఇది వారు సెంట్రల్ అట్రిమ్‌లో అడుగుపెట్టిన క్షణంలో వారిని మాయా వేసవి ప్రపంచానికి తీసుకు వెళ్లడం ఖాయం. ప్రవేశద్వారం ఫుశ్చియా, టరకొయిస్ మరియు సన్ షైన్ యెల్లో వంటి శక్తివంతమైన రంగులలో పెద్ద డ్రాగన్‌ఫ్లై కటౌట్‌లతో అలంకరించబడింది. చురుకైన రంగులు మరియు డ్రాగన్‌ఫ్లై డెకర్ యొక్క మంత్రముగ్ధమైన ఆకర్షణ సంపూర్ణ వేసవి అనుభూతిని కలిగిస్తుంది.