గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 మే 2023 (17:27 IST)

బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంథోనీకి ఎయిర్‌పోర్ట్‌లో చుక్కెదురు

Vijay Anthony
Vijay Anthony
బిచ్చగాడు సినిమాతో యావత్తు ప్రేక్షకులను అలరించిన హీరో విజయ్‌ ఆంథోనీ. తాజాగా బిచ్చగాడు2 సినిమా తీశాడు. సోదరి సెంటిమెంట్‌తో కూడిన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో లాండ్‌అయి ప్రమోషన్‌లో పాల్గొనాల్సివుంది. అయితే చెన్నైనుంచి విమానం లేట్‌ కావడంతో ఆయన ఆలస్యంగా హైదరాబాద్‌లో దిగారు.
 
ఇక అక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో ఆయన బ్యాగ్‌ను తనిఖీ చేసే క్రమంలో ఆలస్యమైంది. దాంతో ఆయన అసహానికి గురయినట్లు తెలిసింది. అక్కడ అదికారులతో చిన్నపాటి చర్చలు జరిగాక వెంటనే ఆయన్ను వదిలేశారు. కానీ అప్పటికే ప్రమోషన్‌ కోసం వెచ్చించిన సమయాన్ని మూడ్‌ బాగోలేదని అర్థంతరంగా క్యాన్సిల్‌ చేసినట్లు సమాచారం. ఇందు కోసం హైటెక్‌ సిటీలో ఓ హోటల్‌ను బుక్‌ చేశారు. కానీ ఆలస్యం కావడం మూడ్‌ బాగోకపోవడంతో విజయ్‌ రాకపోవడంతో హోటల్‌ రూమ్‌ను కూడా కాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది.
 
ఇలాంటి ఘటనలు గతంలో కొంతమంది హీరోలకు కూడా జరిగాయి. పీక్‌టైమ్‌లో ప్రమోషన్‌ కోసం విమానంలో రావడం అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ వల్లకానీ ఇతరత్రా కారణాలతో ఆలస్యం కావడంతో హీరోల మూడ్‌ అనేది మారిపోతూ వుంటుంది. అందుకే ఇకనుంచైనా హీరోలు తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.