బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ
Vijay Antony, Chadalavada Srinivasa Rao, R Narayanamurthy, Kavya Thapar and others
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ' ఏపి, తెలంగాణలో ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ విజయ్ ఆంటోనీ గారు. ఫస్ట్ పార్ట్ చేసిన చదలవాడ శ్రీనివాసరావుగారు పెద్ద విజయం చూశారు. ఈ చిత్రం మే 19న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోనీ గారూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన గొప్ప మానవతా వాది. అలాగే వారి భార్య ఫాతిమా గారి సపోర్ట్ మరవలేను. నేను ఈ సినిమా రెండు రీళ్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రెండు రీళ్లకే నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నాను అన్నారు
నటుడు జాన్ విజయ్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా స్టేజ్ మీద నించున్నాను. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ. విజయ్ నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. బాగా క్లోజ్. అతను హార్డ్ వర్క్ నే నమ్ముతాడు. సింపుల్ హ్యూమన్ బీయింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గానే ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్. ఏ అంచనాలూ లేకుండా వచ్చిన బిచ్చగాడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించింది. ఈ సారి దర్శకుడుగా మరింత పెద్ద బాధ్యత తీసుకున్నాడు విజయ్. బట్ ఈ సారి కూడా మిమ్మల్ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయడు. ఖచ్చితంగా అందరి అంచనాలను ఈ మూవీ అందుకుంటుంది.. మీ అందరికీ బాగా నచ్చుతుంది.. " అన్నారు.
తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మాటలు, పాటలూ నేనే రాశాను. 2016లో వచ్చిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అప్పుడు నన్ను నమ్మినట్టుగానే మరోసారి నాకు అవకాశం ఇచ్చారు. సినిమా చూస్తోంటే విజయ్ ఆంటోనీ గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినట్టుగా లేదు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేశారు. మీ అందరి అంచనాలకు మించి ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది .. " అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని గొప్ప డిస్ట్రిబ్యూటర్స్ గా పేరు తెచ్చుకున్న ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి అబ్బాయి విజయ్ విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం నా ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా పెద్ద హిట్ కావాలి. ఆయన ఇంకా గొప్ప సినిమాలు తీయాలి. విజయ్, ఫాతిమాలది స్టాండర్డ్ కంపెనీ. ఏ సినిమా అయినా సందేశం ఉండేలా చూసుకుంటారు. ఈమూవీ టైమ్ లో విజయ్ కి పెద్ద యాక్సిడెంట్ అయింది. అయినా ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఆయన ఇంకా మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్యూ సోమచ్.. " అన్నారు.
ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్ లో అద్భుతమైన పాయింట్ తో వచ్చారు. ఆ టైమ్ లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్ తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది. నాకు చెల్లి చెల్లీ అనే పాట చాలా ఇష్టం. ఈ పాట ఎంత గొప్పగా తీసి ఉంటారో ఊహించగలను. ఈ సినిమా చాలా చాలా పెద్ద విజయం సాధించాలని.. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఏ లాట్.. " అన్నారు.
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ విజయ్ సర్ అండ్ ఫాతిమా మాడమ్.. ఈ మూవీ జర్నీలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది. అద్భుతమైన ఎమోషన్ కనిపిస్తుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ అనేక మలుపులు, ట్విస్ట్ లు మిమ్మల్ని సీట్లో కూర్చోనివ్వవు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ నెల 19న విడుదలవుతోన్న మా సినిమాను మీరంతా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను .. " అన్నారు.
హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను. బిచ్చగాడు తర్వాత మరో బిగ్ బ్లాక్ బస్టర్ వస్తోంది. పార్ట్ ఒన్ లో చూసిన దానికంటే లార్జర్ స్కేల్ లో సెకండ్ పార్ట్ లో చూస్తారు. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు. ఈ 19న మీరంతా ఫ్యామిలీస్ తో వచ్చి థియేటర్స్ లో సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. " అన్నారు..
నిర్మాత ఫాతిమా ఆంటోనీ మాట్లాడుతూ …. బిచ్చగాడు సినిమాను మీరు ఎంతో ఆదరించారు బిచ్చగాడు 2 అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది ఈ నెల 19 న థియేటర్ లలో వస్తుంది అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు .