శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Updated : గురువారం, 25 మే 2017 (19:44 IST)

అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ పైన టార్గెట్ ఎందుకు?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు పీఠాన్ని ఎక్కారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా అధికంగా నిధులు ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణానే. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు వచ్చ

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు పీఠాన్ని ఎక్కారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా అధికంగా నిధులు ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణానే. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకున్నా తెలంగాణా రాష్ట్రంలో అభివృద్థికి కావాల్సినంత నిధులు ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచో ప్రతి రాష్ట్ర అభివృద్థి కోసం నిధులు ఇవ్వడం కేంద్రంలోని ప్రభుత్వ బాధ్యత. అదే విధంగా కేంద్రంలోని బిజెపి తెలంగాణాకు నిధులు ఇస్తూ వస్తూ ఉంది. 
 
ఒక్కసారిగా నిధులు కాకుండా కొద్దికొద్దిగా నిధులను విడుదల చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి - బిజెపి ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో చెబుతున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిఆర్ఎస్ నేతలు. అమిత్‌ షా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. సాధారణ తెలంగాణ నాయకులు మాట్లాడితే ఫర్వాలేదు. ఏకంగా కెసిఆర్ మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
అమిత్ షా. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. కేవలం ఎంపినే అయినా పార్టీకి ఈయన బాస్. మోడీ, అమిత్ షాలు ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకే జాతీయ అధ్యక్షుడి పదవిని అమిత్ షా పొందగలిగారు. పార్టీలో ఈయన ఏం చెబితే అది జరగాల్సిందే. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సాధించుకున్న బిజెపి ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాలవైపు పడింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమిత్ షాను పర్యటనల కోసం పంపారు. 
 
అది కూడా మొదటగా తెలంగాణా రాష్ట్రంవైపే. తెలంగాణాలో పర్యటించిన అమిత్ షా ఏం చేశారో తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కెసిఆర్ తాను తెలంగాణా ప్రజలకు జవాబు చెప్పాలంటే అమిత్ షాపై అంతెత్తు లేచి పడ్డారు. తెలంగాణా ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు అమిత్ షా చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని, ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్థంగా ఉన్నానని ప్రకటించారు.
 
ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణాలో బిజెపి, టిఆర్ ఎస్ నేతలకు మధ్య తీవ్ర అగాదాన్ని తెచ్చి పట్టింది. అంతేకాదు ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోడీ చాలా సీరియస్‌గా ఉన్నారట. తన స్నేహితుడు అమిత్ షాను కెసిఆర్ నానా మాటలనడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట ప్రధాని. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి వస్తే ఇక కెసిఆర్‌ను ఇద్దరు టార్గెట్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.