శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

భార్యనుకాదనీ.. యువకులతో ఎంజాయ్ చేసే స్వలింగసంపర్క భర్త

హైదరాబాద్ నగరంలో స్వలింగ సంపర్కానికి అలవాటున భర్త ఒకరు కట్టుకున్న భార్యతో పడకసుఖం పంచుకోకుండా యువకులతో రాసలీలలు సాగిస్తూ పట్టుబడ్డాడు.

హైదరాబాద్ నగరంలో స్వలింగ సంపర్కానికి అలవాటున భర్త ఒకరు కట్టుకున్న భార్యతో పడకసుఖం పంచుకోకుండా యువకులతో రాసలీలలు సాగిస్తూ పట్టుబడ్డాడు. పైగా, ఈ స్వలింగ సంపర్క భర్త ప్రముఖ విద్యా సంస్థల అధిపతి కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
 పడి వివాహం జరిగిన నాటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ విద్యాసంస్థల యాజమానిపై అతడి భార్య సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. బాధితురాలి కథనం ప్రకారం 
 
సైదాబాద్‌ పూసల బస్తీకి చెందిన హెచ్‌.దీపికతో జహిరాబాద్‌కు చెందిన అరుణ హైస్కూల్‌, అరుణబాయి డీఈడీ కళాశాల యాజమాని జి.అంకుష్‌తో గత 2014 మే 14వ తేదీన వివాహం జరిగింది. పెళైనా నాటి నుంచి అంకుష్‌ తన భార్యను దూరంగా ఉంచసాగాడు. అకారణంగా చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. అయినా అతడి ప్రవర్తన మారి దగ్గరవుతాడని చాలాకాలంగా వేచి చూసింది. 
 
రోజులు గడిచేకొద్దీ అతనిలో మార్పురాకపోగా, మరింత వింతగా ప్రవర్తించసాగాడు. ఈ క్రమంలో నిత్యం బెడ్‌రూంలో లోపల నుంచి గడియపెట్టుకుని ఒంటరిగా ఉంటూ మోబైల్‌ ఫోన్‌లో లైవ్‌ వీడియా ద్వారా దుస్తులు విప్పదీసి యువకులతో గంటలకొద్ది చాటింగ్‌ చేస్తూ కాలక్షేపం చేయసాగాడు. పైగా, పలు ప్రాంతాల నుంచి తన ప్లాటుకు యువకులను రప్పించుకుని వారితో స్వలింగ సంపర్కం చేస్తూ ఎంజాయ్ చేయసాగాడు. 
 
దీంతో భర్త ప్రవర్తనపై కన్నేసిన భార్య, సెల్‌పోన్‌ లైవ్‌ వీడియాలో ఓ యువకుడితో సాగిస్తున్న చర్యలను కనిపెట్టి అత్తమామలకు చెప్పి భర్తను నిలదీసింది. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోవడమే కాకుండా భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అర్థరాత్రిపూట ఔటర్‌రింగ్‌ రోడ్డులో ఒంటరిగా వదిలి వెళ్లాడు. 
 
అక్కడ నుంచి ఆమె ఎలాగోలా సైదాబాద్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. తన కుటుంబసభ్యుల సాయంతో శనివారం సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని, అతడి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.