బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:56 IST)

హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్

జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ గమ్యస్థానాలకు, అన్ని ఎయిర్‌లైన్స్ ద్వారా మొదటి నుంచి చివరి వరకు ఈ-బోర్డింగ్ సేవలను అందిస్తున్న విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తాము సొంతంగా తయారు చేసిన ఈ డిజిటల్ సొల్యూషన్‌ను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిది. 

తద్వారా భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయి.