బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:22 IST)

టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్: ఎంపీ రేవంత్

బీజేపీకి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించిందని, బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

బండి సంజయ్‌ను మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్‌రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారణకు ఎందుకు అదేశించలేదన్నారు.

‘‘టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది ఆదాయపన్ను శాఖ.. పోలీసులకు సోదాలు చేసే అధికారం ఎక్కడిది? రఘురామరాజుకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. తమ సొంత ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదు?

సంజయ్‌ను మొదటిసారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే.. చంపేందుకు మళ్లీ ప్రయత్నం చేశారు’’ అని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.