బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (08:48 IST)

రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత ప్రశంసలు... కిటుకేమిటబ్బా?

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ ప్రశంసల జల్లు కురిపించారు. బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభకి హాజరైన స్వామిగౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 
 
"రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారిండు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలి.. వారికి అండగా నిలబడాలి. తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దు. రూ. 2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబడితే, 3500కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోంది.

ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే.. మరో పార్టీ 15మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోంది. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించాలి.. చైతన్యం కావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి.. కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది" అని స్వామిగౌడ్ చెప్పుకొచ్చారు.