బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (19:15 IST)

కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్.. : హమ్మ రేవంత్‌రెడ్డి ఎంత మాటనేశాడు?

కేసీఆర్ ప్రోత్సాహంతోనే సీఎం జగన్ చెలరేగిపోతున్నారని, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు కమీషన్లు వస్తున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణకు కాపలాగా ఉండాల్సిన కేసీఆర్ దొంగగా మారారని ధ్వజమెత్తారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ను చేర్చకపోతే కోర్టుకెళ్తామని ప్రకటించారు.

ప్రైవేట్ విద్యుత్ సంస్థల వద్ద అధిక ధరకు విద్యుత్‌ను కొనడానికి.. కేసీఆర్‌ ప్రణాళికలు రచించారని, కమీషన్లకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

మెగా కృష్ణారెడ్డి కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కోరారని రేవంత్‌రెడ్డి చెప్పారు. 
 
అంతకుముందు కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరారు. ఈ నెల 25న అపెక్స్ కమిటీ సమావేశం అజెండాలో చేర్చాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

2014లోనే అనుమతులు, రూ.1450 కోట్లు కేటాయింపు కూడా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊసే లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.