బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:36 IST)

పవన్ అభిమానికి జగన్ సాయం!

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని అత్యవసర చికిత్సకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ  విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు.ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది.అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.