శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:37 IST)

కమలం గూటికి రాములమ్మ?

సొంతగూటికి రాములమ్మ చేరబోతుందా? బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. సోమవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ సమారుగా గం. 1.30 నిమిషాలు పాటు సాగింది.
 
సొంత గూటికి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తరువాత బండి సంజయ్ అరెస్టును విజయశాంతి ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
 
దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణాలో పార్టీ పుంజుకుంటుదని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాసను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలంకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.