ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో సాగుతున్న జోడో యాత్ర.. పోటెత్తిన ప్రజలు

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముమ్మరంగా సాగుతోంది. సోమవారానికి ఈ యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్రకు తెలంగాణ ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. సోమవారం ఏకంగా 28 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర కొనసాగనుంది. 
 
షాద్ నగర్ నుంచి ముచ్చింతల్ దగ్గర పెద్ద షాపూర్ వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. కొత్తూరులో మధ్యాహ్న భోజన విరామం ఇస్తారు. సాయంత్రం 7 గంటల వరకు ముచ్చింతల్ దగ్గర రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ జరుగుతుంది. 
 
రాత్రికి శంషాబాద్ శివారు తండుపల్లి దగ్గర బస చేస్తారు. కాగా, రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై 54వ రోజుకు చేరుకున్న విషయం తెల్సిందే.