మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2017 (21:01 IST)

చాందినీ, సాయికిరణ్ మధ్య సాహిల్... అందుకే చంపాడా?

హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే అతడు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనుమానం వస్తోందని పోలీసులు చెపుతున్నారు. సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్యలోకి ఇటీవలే సాహిల్ అనే యువ‌కుడు ప్రవేశించాడనీ, ఈ కారణంతో చాందినీని

హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే అతడు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనుమానం వస్తోందని పోలీసులు చెపుతున్నారు. సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్యలోకి ఇటీవలే సాహిల్ అనే యువ‌కుడు ప్రవేశించాడనీ, ఈ కారణంతో చాందినీని అతడు హతమార్చి వుంటాడేమోనన్న అనుమానాలున్నాయని వెల్లడించారు. 
 
చాందిని హ‌త్య కేసులో విచార‌ణ ఇంకా జరగాల్సి వుందని చెప్పారు. విచారణలో భాగంగా సాయికిర‌ణ్‌, చాందిని ల్యాప్‌టాప్‌లు, కాల్స్‌ డేటా, సోష‌ల్ మీడియాను ప‌రిశీలిస్తున్నట్లు వెల్లడించారు. చాందినీని కేవలం ఆమె ప్రవర్తన నచ్చకే హత్య చేసినట్లు సాయి కిరణ్ చెప్పిన మాటలను పోలీసులు విశ్వసించడంలేదు. 
 
మరోవైపు చాందినీని హత్య చేసిన తర్వాత ఆమె ఇంటికే వచ్చి ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆమె ఎక్కడ మిస్ అయ్యిందంటూ హంతకుడు సాయి కిరణ్ వెతకడంపై చాందినీ పేరెంట్స్ షాక్ తిన్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.