Daily Horoscope
✕

కోడి రేటు కొండెక్కి కూచుంది

Written By శ్రీ
Updated: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో కోడికి రెక్కలొచ్చి కొండెక్కి కూర్చొంది. దీంతో ముక్క తినాలంటే బెంబేలెత్తిపోతున్నారు నాన్ వెజ్ ప్రియులు. రెండు రోజుల కిందట కిలో 180 రూపాయలు ఉన్న కోడి ధర ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి గరిష్టంగా రూ.240కు చేరింది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జనం కోడి మాంసం, గుడ్డు వినియోగం పెంచారు. అయితే అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా అందనంతగా ధరలు పెరగడంతో వినియోగదారుల కోడి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నారు అమ్మకందారులు.
 
ఇక ఆదివారం వస్తే మరో 20 నుండి 30 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. అటు కూరగాయలు రేటు కూడా ఆకాశాన్ని తాకడంతో ఇదేం కాలంరా బాబు ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదని వాపోతున్నారు.

అన్నీ చూడండి

ఊర్వశి రౌతేలాకు తగ్గుతున్న క్రేజ్.. నోరా ఫతేహికి పెరుగుతున్న క్రేజ్

Vishwak Sen : మా జీవితమే ఈఎన్‌ఈ రిపీట్, యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ :విశ్వక్ సేన్

Sharwanand: నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో: భోగి ప్రి-రిలీజ్ మీట్లో శర్వా

Niharika Konidela :పాకెట్ రాకెట్స్ చిత్రం నుంచి అప్సర అంటూ సాగే ఇల్యూష‌న్‌ సాంగ్ రిలీజ్

Netflix Megaverse :ఇది నా అడ్డా అంటూ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్

తర్వాతి కథనం
Show comments