గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (21:18 IST)

అందుకే.. కాంగ్రెస్ నేత‌లు కంటి ప‌రీక్షలు చేయించుకోవాలి : హ‌రీష్ రావు

సిద్ధిపేట రాజస్థాన్ మార్వాడి సమాజ్ వారి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ స‌భ‌లో హ‌రీష్ రావు మాట్లాడుతూ... భార‌తంలో పాండవుల ప‌క్షాన.. ఇప్పుడు టీఆర్ఎస్ వైపు యాద‌వులు ఉన్నారు.
 
యాద‌వుల అభివృద్దికి కృషి చేస్తోన్న కేసీఆర్‌ను క‌ర్నాట‌క మంత్రి రేవ‌న్న ప్ర‌శంసించారు. యాద‌వుల‌కు 6 వేల కోట్ల‌తో గొర్రె పిల్ల‌ల‌ను పంపిణీ చేసాం. ప‌ద‌వుల్లోను యాద‌వుల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాం. ప‌ట్ట‌ణ యాద‌వుల‌కు గొర్రె పిల్ల‌ల‌ను ఇచ్చేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. 
 
గొల్ల కురుమ‌ల గురించి ఆలోచించిన తొలి వ్య‌క్తి కేసీఆర్. కాంగ్రెస్ నేత‌ల‌కు అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. కంటి ప‌రీక్ష‌లు చేసుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం పుట్టింది సిద్దిపేట‌లోనే అని గుర్తుచేసారు.